Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ కార్యాలయం, కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ తరుణంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకువచ్చారు. ప్రజలు హామీ ఇస్తే బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళతామని అన్నారు. నేను మీతో ఉంటాను మీరు నాతో ఉండండి తెలంగాణ లాగా భారత్ ను కూడా అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారికి అడ్డంకులు సృష్టిస్తుంటారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.