Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఓ దొంగతనం కేసులో ఒక దొంగను విచారణ చేయగా పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దొంగ చెబుతున్న జవాబులు విని ఆశ్చర్యపోయ్యారు. ఈ ఘటన చత్తీస్‌గడ్‌లోని దుర్గ్ పోలీస్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు సిబ్బంది అంతా ఉండగానే అభిషేక్ పల్లవ్ అనే పోలీస్ సూపరింటెండ్ అధికారి ఒక దొంగను ఇంటరాగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆ అధికారి దొంగను చోరి చేసిన డబ్బును ఏం చేశావ్ అని ప్రశ్నించారు. దానికి ఆ దొంగ ఆ డబ్బును పశువుల మేత కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశానని, మరికొంత సొమ్మును పేదవాళ్లకు దుప్పట్లు కొన్నానని చెప్పాడు. ఆ దొంగ సమాధానాలకు అధికారుల ఆశ్చర్యపోవడమే గాక వారి ముఖాల్లో నవ్వు తెప్పించాయి.