Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలతోపాటు, గ్రూప్-1, గ్రూప్-4 తదితర పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోన్న తరుణంలో తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గురుకులాల్లో దాదాపు 12 వేలకు పైగా టీచర్ పోస్టులకు భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
వీటిల్లో ఇప్పటికే గురుకులాల్లో 9,096 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులుచ్చింది. మరో 3 వేల ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. అనుమతి రాగానే నోటిఫికేషన్ వెనువెంటనే విడుదల చేయాలని తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ మూడో వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు కూడా ఈ నెల్లోనే విడుదలవనున్నాయని సమాచారం.