Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో బాధితురాలు నివాసం ఉంటోంది. బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి ముగ్గురు యువకులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం, ఆమెను కత్తిలో బెదిరించారు. ఈ తరుణంలో ఆమెపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా లైంగిక దాడి చేస్తున్న క్రమంలో ఆమె ప్రయివేటు భాగాలపై సిగరెట్‌తో కాల్చుతూ రక్షసానందం పొందారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారు.
నిందితులలో ఒకరు ఈ సంఘటనను వీడియో చేశారు. అనంతం, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు గురి చేశారు. కాగా, బాధితురాలు తనకు జరిగిన అన్యాయం మరొకరి జరగొద్దనే కారణంతో ఎన్జోవోలను ఆశ్రయించింది. దీంతో, నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 376డి (గ్యాంగ్ రేప్), 377 (అసహజ సెక్స్), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), ఇతర నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టారు.