Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జీ 20 కూటమి దేశాల అధ్యక్ష బాధ్యతలు డిసెంబర్ ఒకటిన ఇండొనేషియా నుంచి అధికారికంగా స్వీకరించిన భారత్ దేశవ్యాప్తంగా ఏడాది పాటు అనేక ప్రాంతాల్లో విశేష కార్యక్రమాలు నిర్వహించనుంది. అయితే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందనే విషయంలో సలహాలు, సూచనలు స్వీకరించేందుకు అన్ని పార్టీల అధ్యక్షులతో కేంద్రం సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ అఖిల పక్ష సమావేశానికి ఆయా పార్టీల అధ్యక్షులే హాజరుకావాలనే నిబంధన ఉండటంతో ప్రతినిధులను పంపడానికి అవకాశం లేదు. డీ
బీజేపీతో ఘర్షణ తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈ సమావేశానికి హాజరుకాకపోవచ్చని సమాచారం. ఢిల్లీ మద్యం స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడం అలాగే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఢీ అంటే ఢీ అనేలా మారాయి. దీంతో కేంద్రం సోమవారం నిర్వహించబోయే సమావేశానికి కేసీఆర్ వెళ్ళరనే తెలుస్తోంది.