Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ ఆంటోనీ విక్టర్. ప్రపంచంలోనే అత్యంత పొడవాటి చెవి వెంట్రుకలు కలిగిన మనిషిగా రికార్డుకెక్కాడు. 2007లో పొడవైన చెవి వెంట్రుకలు కలిగిన మనిషిగా ఆంటోనీ పేరుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చేర్చారు. అయితే, ఇప్పటికీ అవి చెక్కు చెదరలేదు. 7.12 ఇంచులు (18.1 సెంటీమీటర్లు) ఉన్న అతని చెవి వెంట్రుకలకి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.