Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పటేళ్లు, పట్టణాలు, పాడిపరిశ్రమ నిర్ణయాత్మక శక్తిగా ఉన్న గుజరాత్ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.మధ్య గుజరాత్‌లో బీజేపీ పట్టు కొనసాగుతున్నప్పటికీ ఆప్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉత్తర గుజరాత్‌లో ఆప్ ఉనికి లేకపోయినప్పటికీ అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. అందుకే ఈ దశ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌పై అత్యధికంగా దృష్టి పెట్టి ఉధృతంగా ప్రచారం చేశారు. బ్రాండ్ మోడీ నినాదంతో బీజేపీ, అధికార వ్యతిరేకతను నమ్ముకొని కాంగ్రెస్, ఆప్‌లు తలపడుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మధ్య, ఉత్తర గుజరాత్‌ల్లోని 14 జిల్లాల్లో 93 స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. 833 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ, ఆప్ మొత్తం 93 స్థానాల్లో, కాంగ్రెస్ 90 చోట్ల, దాని మిత్రపక్షం ఎన్సీపీ మూడు స్థానాల్లో పోటీ పడుతున్నాయి. 255 మంది స్వతంత్రులూ బరిలో ఉన్నారు. 2.54 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 14,975 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు.