Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కారు విక్రయానికి చెందిన సొమ్ము ఇవ్వకుండా తిప్పించుకుంటున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని రాడ్డుతో కొట్టి చంపేశాడు. డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహీన్‌నగర్‌కు చెందిన మహమ్మద్ అక్బర్ (37), ఎనిమిది నెలల క్రితం అబ్దుల్ రెహ్మాన్ ఖాద్రి వద్ద కారు కొన్నాడు. రూ. 2.5 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, దాని కోసం అక్బర్ తిప్పుతున్నాడు. ఆదివారం రాత్రి అక్బర్ ఇంటికి వచ్చిన ఖాద్రి ఆగ్రహంతో అక్బర్ తలపై రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. అక్బర్ అక్కడికక్కడే మృతి చెందాడు.