Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వేమూరు మండలం జంపని దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి టాటాఏస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..ప్రమాదంలో మరో 16 మందికి గాయాలయ్యాయి. క్షథగాత్రులను స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కృష్ణా జిల్లా నిలపూడి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.