Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట కొండ కింద ఉన్న పాత జడ్పీ హైస్కూల్ భవనంలోని శిల్ప కళాశాలను దేవస్థాన ఈవో గీతారెడ్డి ఆదివారం పునఃప్రారంభించారు. దేవస్థాన పురోహితులు సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి కళాశాలను తెరిచారు. 2018 నవంబరు 15న యాదగిరీశుడి సన్నిధిలో రాష్ట్రంలో తొలిసారిగా వైటీడీఏ ఆధ్వర్యంలో శిల్ప కళాశాల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 11 నెలల కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలను కూడా అందజేశారు. శిల్పకళలో మూడేళ్ల డిగ్రీ కోర్సు నిర్వహించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం నుంచి శిల్ప కళాశాలకు ఇటీవల అనుమతి లభించడంతో వైటీడీఏ అధికారులు ఔత్సాహిక కళాకారుల కోసం ప్రకటన విడుదల చేశారు. 15మంది ఔత్సాహిక కళాకారులు రాత పరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరై అడ్మిషన్లు పొందారు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.