Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్ రెండో దశ ఎన్నికల పోలింగ్ నేడు సజావుగా కొనసాగుతోంది.ఉదయం 9 గంటల వరకు 4.6 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాకుండా ప్రధాని ట్విట్టర్ ద్వారా ప్రజాస్వామ్యం పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు.
దేశ ప్రజలకు నా అభినందనలు. అలాగే, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘానికి కూడా అభినందనలు అని తెలిపారు.అలగే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్ నగరంలోని షిలాజ్ అనుపం స్కూలు బూత్ లో ఓటేశారు. సోమవారం 10 గంటలకు పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. వీరితో పాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఆయన భార్యతో కలసి అహ్మదాబాద్ లో ఓటు వేశారు. విరంఘమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హార్థిక్ పటేల్ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య గుజరాత్ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.