Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాలాపూర్ వాడి హుడా కాలనీలో ఒక వ్యాపారిని ఆటో డ్రైవర్ హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఎల్‌బీ నగర్ డీసీపీ సుప్రీత్ సింగ్ మీడియాకు వివరించారు. ఏడాది క్రితం మహ్మద్ అక్బర్ (36) అనే వ్యక్తి మహ్మద్ ఖాద్రి అనే ఆటో డ్రైవర్ వద్ద రూ.2.5 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేకపోయాడు. ఈ తరుణంలోనే గత రాత్రి అక్బర్ ఇంటికి వచ్చి అతనిపై ఐరన్ రాడ్‌తో ఖాద్రి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అక్బర్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే అతను మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్బర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్బర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి ఖాద్రిని అదుపులోకి తీసుకున్నారు.