Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ జోరు కొనసాగుతోంది. ఆరో ప్రపంచకప్ టైటిల్ వేటలో దూసుకెళ్తోంది. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన బ్రెజిల్ నిన్న దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ‘రౌండ్ ఆఫ్ 16’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియాను గుక్కతిప్పుకోనివ్వకుండా చేసిన బ్రెజిల్ 4-1తో అద్భుత విజయం సాధించి వరుసగా ఎనిమిదోసారి ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. వినిసియస్ జూనియర్, రిచర్లిసన్, లుకాస్ గోల్స్ సాధించారు. బ్రెజిల్ ప్రపంచకప్ చరిత్రలో 1954 తర్వాత తొలి అర్ధ భాగంలో నాలుగు గోల్స్ సాధించడం ఇదే తొలిసారి. కాగా, సౌత్ కొరియాను కంగు తినిపించిన బ్రెజిల్ క్వార్టర్స్‌లో క్రొయేషియాతో తలపడుతుంది. ఆరో ప్రపంచకప్ కోసం కలలు కంటున్నట్టు బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాలర్ నేమార్ పేర్కొన్నాడు. మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని కూడా గెలిచి ప్రపంచకప్ సాధించడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన బ్రెజిల్‌కు 2002 తర్వాత ప్రపంచకప్ టైటిల్ కలగానే మిగిలిపోయింది.