Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ యువనేత దేవినేని అవినాశ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు తనిఖీలను నిర్వహిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఐటీ అధికారులు ఒక్కసారిగా వీరి ఇళ్లకు చేరుకుని దాడులు జరుపుతున్నారు.
దాడుల వెనుక ఉన్న కారణం ఏమిటనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ... హైదరాబాద్ లో ఉన్న వంశీరామ్ రియలెస్టేట్ కంపెనీలో వీరు పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో దాడులు జరుగుతుండొచ్చని భావిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఐటీ దాడులు విజయవాడలో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపాయి.