Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భర్తతో కలిసి సొంతూరుకు వెళుతున్న ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. ఆ వెంటనే డ్రైవర్ ఆ బస్సును ప్రభుత్వ ఆస్పత్రికి వద్దకు తీసుకెళ్లి తల్లిని, నవజాత శిశువును వైద్యులకు అప్పగించారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి యూపీలోని కన్నౌజ్ జిల్లా ఛిబ్రమౌకు వెళ్తుండగా ఆదివారం చోటుచేసుకుందని ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ అలోక్ కుమార్ చెప్పారు. ఢిల్లీ నుంచి యూపీలోని ఈటా జిల్లా లోని సొంతూరుకు తాము వెళ్తున్నట్లు మహిళ భర్త సోమేశ్ కుమార్ చెప్పారు. ఆ సమయంలో బస్సులోనే పురిటి నొప్పులు వచ్చాయని అతను వివరించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారన్నారు.