Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిన వేళ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేసి పరామర్శించారు. తాజా పరిణామాలపై చర్చించారు. ఇటీవల జరిగిన ఘటనలకు ఆయన సానుభూతి తెలిపారు. ఢిల్లీకి రావాలంటూ సూచించారు. ఒక మహిళని చూడకుండా.. కారులో ఉండగానే తీసుకువెళ్లడం అనేది దారుణమని అన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అంతేకాకుండా ఆ ఘటనను చూసి చాలా బాధపడ్డానన్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని మోడీ అన్నారు. షర్మిలతో ప్రధాని సుమారు 10 నిముషాలు మాట్లాడారు. నిన్న జీ-20 సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ వద్ద కూడా ప్రధాని మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి, కేసీఆర్ సర్కారుపై పోరాడుతున్న సొంత చెల్లెలు షర్మిలపై దాడి జరిగినా... హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినా... ఆమె కూర్చుని ఉండగానే కారును క్రేన్‌తో లాక్కెళ్లి ఠాణాకు తరలించినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. ఈ సంఘటనలను ఖండించలేదు. కానీ... ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఆ విషయం తెలిసి నాకే బాధ కలిగింది. ఇంత జరిగినా మీరెందుకు మాట్లాడలేదు?’ అని నేరుగా జగన్‌నే ప్రశ్నించారు. దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక... జగన్ తనదైన శైలిలో నవ్వుతూ మౌనంగా నిల్చున్నట్లు తెలిసింది.