Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వ్యభిచార రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. విదేశీ మహిళలతో వ్యభిచారం, డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా సదరు ముఠా విస్తరించింది. ఉద్యోగాల పేరుతో యువతులకు వల విసిరింది. 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు ఆర్నవ్‌ను అరెస్ట్ చేసి.. ఏండీఏంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. వెబ్‌సైట్, వాట్సాప్ గ్రూప్స్, కాల్‌సెంటర్లు, యాడ్స్ ద్వారా.. కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సదరు ముఠా సప్లయ్ చేస్తోందని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 39 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 915 మంది అమ్మాయిలను ముంబై, కోల్‌కతా నుంచి.. కీలక నిందితుడు ఆర్నవ్ సప్లయ్ చేశాడని తెలిపారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.