Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 2024 నాటికల్లా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 సినిమా థియేటర్లని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థ సీఎస్ సీ ఈ- గవర్నెన్స్ సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. దీనికోసం అక్టోబర్ సినిమాస్ తో పార్టనర్షిప్ తీసుకున్నట్లు తెలిపింది.
ఈ రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందంలో గ్రామీణ ప్రాంతాల్లో 100-200 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఒక లక్ష సినిమా హాళ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వినోద రంగం అభివృద్ధి చెందుతోన్న తరుణంలో ఈ సీఎస్ సీ సినిమా హాళ్లు వాణిజ్య హబ్ లుగా మారునున్నాయి. అందుకు గ్రామాల్లోని చిన్న ఆంత్రప్రెన్యూర్లకు అవకాశాలు ఇవ్వబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్ల కాన్సెప్ట్ చాలా కొత్తదైనప్పటికీ, ఇది సక్సెస్ అవుతుందని సీఎస్ సీ ఎండీ సంజయ్ కుమార్ రాకేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.