Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంగళవారం నాడు ఎల్బీనగర్ పరిధిలో కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నాలా బాక్స్ డ్రైన్‌ను ప్రారంభించారు. వీటీతో పాటు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి ఫిర్జాదిగూడ వరకు లింక్‌రోడ్డు, ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో పెట్ యానిమల్ శ్మశాన వాటిక ప్రారంభించారు. ఈ తరుణంలో కేటీఆర్ మాట్లాడుతూ అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఊకదంపుడు ఉపన్యాసాలు, చిత్రి విచిత్ర బట్టలు వేసుకుంటే అభివృద్ధి కాలేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, చిత్తశుద్ధితో డెవలప్‌మెంట్ సాధ్యం అయ్యిందన్నారు. 240 కోట్ల మొక్కలతో రాష్ట్రమంతా హరితహారం కార్యక్రమం చేపట్టామన్నారు. తత్ఫలితంగా రాష్ట్రంలో 7.7 శాతం వృద్దితో 31.7 శాతం గ్రీన్ కవర్ అయిందన్నారు. ఇప్పుడు ప్రారంభించిన నాలా పనులు వచ్చే జనవరి చివరి నాటికి పూర్తి అవుతాయన్నారు. వర్షం కాలం నాటికి మొదటి దశ నాలా పనులు మొత్తం పూర్తి చేసి ముంపు సమస్య తొలగిస్తామన్నారు. అంతే కాకుండా హయత్‌నగర్ వరకు మెట్రో కారిడార్‌ను పొడిగించగా, నాగోల్-ఎల్బీ నగర్ మధ్య మెట్రో అనుసంధానించడం జరుగుతుందన్నారు. త్వరలోనే మూసీపై 14 బ్రిడ్జిలను కూడా కడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌తో పాటు, మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.