Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ నటించి ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందుతోంది. విదేశాల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమైంది. ఇటీవల గోవాలో జరిగిన ఇఫీ ఫిలిం ఫెస్టివల్ లోనూ ఆర్ఆర్ఆర్ సందడి చేసింది. ఇటీవలే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళిని ఎంపిక చేయడం తెలిసిందే.
ఈ తరుణంలో తాజాగా ఈ చిత్రానికి మరో విశిష్ట గుర్తింపు లభించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ విన్నర్ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు అవార్డు నిర్వాహకులు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి సమాచారం అందించారు. 2023 ఫిబ్రవరి 23న లాస్ ఏంజెల్స్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.