Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ నెల 10, 11వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగుతున్న తరుణంలో 9న ఉదయం 11 గంటల నుంచి 11వ తేదీన లీగ్ ముగిసే వరకు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. లుంబినీ, ఎన్టీఆర్ గార్డెన్‌ను కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియన్ రేసింగ్ లీగ్ నెక్లెస్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, కొత్త సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కంపౌండ్, ఐమ్యాక్స్ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ థియేటర్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అవసరమైతే 7, 8 తేదీల్లోను ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని తెలిపారు.