Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం కాకర్లపల్లిలో దారుణం జరిగింది. గంధం ఓదేలు అనేవ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన నాలుకకోసి దుండగులు పరారైయ్యారు. మాస్కులు ధరించి ఉన్న నలుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడ్డ ఓదేలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.దీనిపై మరిన్ని విషయాలు తెలవాల్సి ఉన్నాయి.