Authorization
Sat May 17, 2025 04:27:37 am
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకు ఈ నెల 4న ఎన్నికలు జరిగాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులు కలిపి మొత్తం 1349 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో గెలిచేది ఎవరో, ఓడేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 10 వేల మంది ఢిల్లీ పోలీసులను అక్కడ మోహరించారు. ఇదిలావుంటే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలు పీఠం ఆప్‌దేనని స్పష్టం చేశాయి. 15 ఏండ్లుగా బీజేపీ ఏలుబడిలో ఉన్నని ఈసారి ఆప్ కైవసం చేసుకుంటుందని, 250 వార్డులకుగాన ఆప్ 155 వార్డుల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి.