Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలో మరోసారి రేసింగ్ కార్లు దూసుకుపోనున్నాయి. ఈ నెల 9న ఉదయం 11 గంటల నుంచి 11 సాయంత్రం వరకు ఎన్‌టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ ఇన్‌చార్జి అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు వెళ్లే ట్రాఫిక్‌ను షాదాన్ కాలేజ్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. బుద్ధభవన్/నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు అనుమతిస్తారు. రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్‌మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్/తెలుగుతల్లి నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్‌మి నార్, రవీంద్రభారతి వైపు అనుమతిస్తారు. బీఆర్‌కేఆర్ భవన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఇక్బాల్‌మినార్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వైపు అనుమతిస్తారు.
ఖైరతాబాద్ బడాగణేశ్ వీధి నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను రాజ్‌దూత్ వైపు అనుమతిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లె్‌సరోడ్, లుంబినీ పార్క్‌లు ఈ నెల 9 నుంచి ఈ నెల 11 వరకు మూసి ఉంటాయి.