Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బగోటా: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ మీరాబాయ్ ఛాను రజత పతకం నెగ్గింది. మణికట్టు గాయంతో బాధపడుతూ కూడా మీరాబాయ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతకం సాధించిన మీరాబాయ్.. కొలంబియాలోని బగోటాలో జరుగుతున్న ఈ టోర్నీలో కూడా మహిళల 49 కేజీల విభాగంలో మొత్తం 200 కేజీల బరువు ఎత్తి రజతం గెలుచుకుంది. మీరాబాయ్ ఛాను స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తింది. క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తడం ద్వారా మీరాబాయ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేసింది. చైనాకు చెందిన జియాంగ్ హిహువా 206 కేజీల (93+113) బరువు ఎత్తడం ద్వారా తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. చైనాకు చెందిన మరో క్రీడాకారిణి హౌ జిన్‌హువా 198 కేజీల (89+109) బరువు ఎత్తి కాంస్యం పతకం నెగ్గింది.