Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూసుకుపోతోంది. ఎంసీడీ ఎన్నికల్లో 132 వార్డుల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ కేవలం 104 వార్డుల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 11 వార్డుల్లో ఇతరులు మూడు వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 250 వార్డులకు డిసెంబర్ 4న ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు అవసరమైన 126 వార్డులను సునాయాసంగా కైవసం చేసుకునే దిశగా ఆప్ దూసుకెళుతోంది. ఎంసీడీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండటంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. కేజ్రీవాల్ ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్నారు. ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు కేజ్రీవాల్ నివాసానికి పూలను తీసుకువచ్చారు. మరోవైపు ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఆనందంతో నృత్యాలు చేస్తూ పరస్పరం స్వీట్లు పంచుకున్నారు.