Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగిత్యాలలో పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్ మొదట నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యాలయంలో పార్టీ జిల్లాశాఖ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును సీట్లో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సీఎం వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మోతె శివారులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ పెద్ద ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.