Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ కు పొగాకు నమిలే అలవాటు ఉందన్న కేటీఆర్ విమర్శలపై నిర్మల్ ర్యాలీలో భాగంగా బండి సంజయ్ స్పందించారు. ఈ తరుణంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై సంచలన వాఖ్యలు చేశారు. ఈ ట్విట్టర్ టిల్లు నేను పొగాకు తింటానని అంటున్నాడు. ఇది పచ్చి అబద్ధం. డ్రగ్స్ కు బానిస అయింది కేటీఆర్. నేను నా శరీరంలో రక్తం సహా ఏ నమూనాను అయినా పరీక్షల కోసం ఇవ్వడానికి సిద్ధం. నాకు పొగాకు తినే అలవాటు లేదని నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రక్తం, వెంట్రకల నమూనాలు ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని నిరూపించుకునేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా అని బండి సంజయ్ ప్రశ్నించారు. వీటిని ట్విట్టర్ ద్వారా దీనిపై పోస్ట్ పెట్టారు.