Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గత 15 ఏండ్లుగా ఢిల్లీ కార్పోరేషన్‌ను ఏలుతున్న బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. వరుసగా మూడు పర్యాయాలు మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు 97 వార్డుల్లో మాత్రమే పరితమైంది. ప్రస్తుతం ఆప్ మరో 8 వార్డుల్లో, బీజేపీ 6 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు వార్డుల్లో మాత్రమే గెలిచి, మూడు వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. ఈ తరుణంలో ఢిల్లీ మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను దాటడం విశేషం.