Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఢిల్లీ మెట్రో రైల్లో ఓ యువకుడు ఇటీవల ఢిల్లీ మెట్రోలో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో దాహం వేయడంతో తన బ్యాగ్‌లోని వాటర్ బాటిల్‌ను తీసుకోబోయాడు. ఆ సమయంలో పొరపాటున యువకుడి బాక్స్ కిందపడిపోయింది. దానిలో అన్నం అంతా కింద పడింది. ఆ క్రమంలో అన్నం పడిపోయింది. యువకుడు వెంటనే తన వద్ద ఉన్న పుస్తకంలోని పేపర్లను చింపి రైల్లోని ఫ్లోర్‌ను తుడుస్తాడు. అనంతరం ఆహారం పడకముందు రైలు ఫ్లోర్ ఎంత నీట్‌గా ఉందో అంతే నీట్‌గా తన హ్యాండ్ కర్చిప్‌తో శుభ్రం చేస్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అషు సింగ్ అనే నెటిజన్ లింక్డిన్‌లో పోస్టు చేశాడు. ఈ యువకుడు స్వచ్ఛభారత్ మిషన్‌కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.