Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రోజు రోజుకు సీబీఐ వేట కోనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఏ రాష్ట్రంలో ఎన్ని సీబీఐ కేసులు నమోదయ్యాయో వాటి వివరాలు వెల్లడయ్యాయి. గత ఐదేళ్లలో ప్రజాప్రతినిధులపై ఏపీలోనే అత్యధిక సీబీఐ కేసులు నమోదవ్వడం విశేషం. 2017-22 మధ్య కాలంలో ఏపీలో సీబీఐ అత్యధికంగా 10 కేసులు నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 6 చొప్పున సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు తెలియజేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లో 5, పశ్చిమ బెంగాల్ లో 5, తమిళనాడులో 4, మణిపూర్ లో 3, ఢిల్లీలో 3, బీహార్ లో 3, జమ్మూ కశ్మీర్ 2, కర్ణాటకలో 2 కేసులు, హర్యానాలో 1, చత్తీస్ గఢ్ లో 1, మేఘాలయలో 1, ఉత్తరాఖండ్ లో 1, మధ్యప్రదేశ్ లో 1, మహారాష్ట్రలో 1, లక్షద్వీప్ లో 1 కేసు నమోదైనట్టు వివరించారు. అదే సమయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సీబీఐ 56 కేసులు నమోదు చేసిందని, వీటిలో 22 కేసుల్లో చార్జిషీటు నమోదు చేయడం జరిగిందని కేంద్ర మంత్రి వివరించారు.