Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 23 వికెట్లు సాధించాడు. ఇక అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చాహల్ రికార్డును సిరాజ్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో 14 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
సెంచరీతో చెలరేగిన మెహాదీ హసన్ ఇక కీలకమైన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. కేవలం 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మహ్మదుల్లా, మెహాదీ హసన్ అదుకున్నారు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 147 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ మ్యాచ్‌లో మెహాదీ హసన్ ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న మెహాదీ హసన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా మెహాదీ హసన్ కూడా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.