Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మహిళల స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఉచిత కుట్టు మిషన్ పంపిణీ పథకం. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రభుత్వం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తుంది. ఇది పూర్తిగా ఉచితం. అయితే, అర్హత కలిగిన మహిళలకే ఈ పథకం కింద కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారు. అర్హతలను బట్టి మహిళలు దరఖాస్తు చేసుకుంటే, ప్రభుత్వం వారికి కుట్టు మిషన్లను మంజూరు చేస్తుంది.
అర్హతలు: 1. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు
2. కూలీపని చేసుకునేవారు, కుటుంబ ఆదాయం రూ. 12 వేలకు మించకూడదు.
3. గ్రామీణ, నగరాల్లో నివసించే పేద మహిళలు ఈ పథకానికి అర్హులు.
4. ఆర్థికంగా బలహీనులైన మహిళలు ఈ పథకానికి అర్హులు.
దరఖాస్తు విధానం: 1. ఉచితంగా కుట్టు మిషన్ పొందాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.india.gov.in కి వెళ్లాలి.
2. ఆ తరువాత ఇక్కడ ఉచిత కుట్టు మిషన్ పథకానికి సంబంధించి అప్లికేష్ ఉంటుంది. ఆ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆపై దాన్ని నింపాలి. నింపిన ఫామ్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్లను జతపరచాలి.
3. ఫామ్, సర్టిఫికెట్లను జత చేసి సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. ఈ దరఖాస్తును పరిశీలించి, అధికారులు ఓకే చేస్తే ఉచితంగా కుట్టు మిషన్ మంజూరు అవుతుంది.