Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ హత్య చేయడంతోపాటు చైనా కత్తితో ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచి ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పడేశాడు. ఈ దారుణ హత్యా సంఘటన సంచలనం రేపింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు ఇటీవల నిందితుడు ఆఫ్తాబ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించారు. ఈ తరుణంలో దర్యాప్తులో ఆఫ్తాబ్ వెల్లడించిన అంశాలు బహిర్గతమయ్యాయి.
బంబుల్ డేట్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని శ్రద్దా వాకర్ మే 17న గురుగ్రామ్‌లో కలిసిందని నిందితుడు ఆఫ్తాబ్ పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత మరునాడు మధ్యాహ్నం ఆమె తమ ఫ్లాట్‌కు తిరిగి వచ్చిందని చెప్పాడు. ఈ అంశంపై తమ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని, దీంతో ఆగ్రహంతో ఆమె గొంతునొక్కి హత్య చేసినట్లు దర్యాప్తులో తెలిపాడు. కొంత కాలంగా తాము సన్నిహితంగా కాకుండా కేవలం రూమ్‌మేట్స్‌గా నివసిస్తున్నట్లు అతడు వెల్లడించాడు.