Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనేశ్వర్: ప్రభుత్వ కార్యాలయంలో ఓ యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాని ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ప్రభుత్వ కార్యాలయ భవనంలోని ఆరోగ్యశాఖ ఛాంబర్‌లో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'సీనియర్ గుమస్తా, డ్రైవర్ కలిపి అకృత్యానికి ఒడిగట్టారు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆదివారం కార్యాలయానికి రమ్మన్నారు. అక్కడికి వెళ్లాక ఆదివారం రాత్రి కార్యాలయంలోనే ఉంచి ఇద్దరూ లైంగికదాడికి పాల్పడిన్నట్లు సంబల్‌పూర్‌కు చెందిన బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులిద్దరినీ ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు.