Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రును తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు. బాధితులు ఐరాల మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 26 మంది ఉన్నారని చెప్పారు. వారంతా జెట్టిపల్లి పెండ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.