Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కుత్బుల్లాపూర్ పేట్ బాషీరాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాగిన మత్తులో లారీ కంటైనర్ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కొంపల్లిలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ కిందపడటంతో కొంపల్లి సిగ్నల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.