Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్: పట్టాలపై పడిన బియ్యాన్ని ఏరుకునే ప్రయత్నంలో ఓ మహిళ రైలు కింద పడి మరణించింది. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో బుధవారం ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో చివరి ట్రాక్‌పై గూడ్స్ రైళ్లను నిలుపుతుంటారు. ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో బస్తాల నుంచి జారిపడే బియ్యం గింజలను ఏరుకునేందుకు కూలీలు, యాచకులు వస్తుంటారు. బుధవారం బియ్యం ఏరుకునే క్రమంలో ఓ మహిళ గూడ్స్ రైలు కిందికి వెళ్లారు. ఇంతలోనే రైలు కదలడంతో అక్కణ్నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్లాట్‌ఫాంకు, రైలుకు మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మరణించారు. మృతురాలు పేరు గంగవ్వ అని ఆమెతోపాటు వచ్చినవారు చెప్పారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.