Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు బుధవారం అనుమతి మంజూరు చేసింది. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పాదయాత్రకు అనుమతిచ్చిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం.. యాత్రలో వంద మంది కంటే ఎక్కువ పాల్గొనరాదని పేర్కొంది. అలాగే పోడు వ్యవసాయం, గొత్తికోయలు, అటవీ అధికారి చనిపోవడం గురించి మాట్లాడరాదని హైకోర్టు స్పష్టం చేసింది.