Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 62,504 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 18,570 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఎల్ అండ్ టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు ట్రేడింగ్ మొదట్లో లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సురెన్స్, టీసీఎస్, కొటక్ మహీంద్ర బ్యాంకు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరో వైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.82.27 వద్ద ప్రారంభమైంది.