Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ రంగారెడ్డి: ప్రేమించాలని ఒకరు, పెళ్లి చేసుకోవాలని ఇంకొకరు, తమను కాదని మరో వ్యక్తిని ప్రేమిస్తుందని మరొకరు యువతులపై దాడులు నిత్యాకృత్యమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.ఆమెకు దూరపుబంధువైన యువకుడు తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని ఏఎన్‌ఎంపై వెంటపడుతూ కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు.
గురువారం కూడా ఆమెను పెళ్లి చేసుకొవాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో ఆమెపై కత్తి తో దాడి చేసి పారిపోయాడు. దీంతో యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.