Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ.. ఇప్పుడు కనీసం 20 స్థానాలకే పరిమితం అయ్యేలా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతన్న అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం ఒక్కస్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. మరో 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 59 స్థానాలను కోల్పోవడం గమనార్హం. కాగా, ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నది. మొత్తం 182 స్థానాలకుగాను ఇప్పటి వరకు 25 స్థానాల్లో విజయం సాధించగా.. మరో 129 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.