Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ పార్టీ దాటేయ్యడం విశేషం. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలు ఉండగా, 35 స్థానాలు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 36 స్థానాల్లో గెలిచి మరో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 23 స్థానాల్లో గెలిచి మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో బోణీయే చేయలేకపోగా, ఇతరులు మూడు ఓట్ల గెలిచారు.