Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పంజాబ్‌లోని భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అబోహర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న ఓ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్ చాలాసేపు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బెటాలియన్‌లో కలకలం రేగింది. ఈ తరుణంళక్ష బుధవారం ఉదయం 7.40 గంటలకు పొరపాటున జీరో లైన్‌ను దాటి పాకిస్తాన్ భూభాగానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ ప్రాంతానికి చేరుకోగానే పాక్ రేంజర్లు భారత జవాన్‌ను అరెస్ట్ చేశారు. సదరు జవాన్ బీఎస్‌ఎఫ్‌లోని 66 బెటాలియన్‌కు చెందినవాడు. దట్టమైన పొగమంచు కారణంగా సరిహద్దు దాటినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
జవాను సరిహద్దు దాటినట్లు సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. భారత జవాను తమ నిర్బంధంలో ఉన్నట్లు పాక్ రేంజర్లు ధృవీకరించారు. అయితే జవాన్‌ను తిరిగి పంపేందుకు పాక్ రేంజర్లు నిరాకరించారు. పొగమంచు కారణంగా తమ సహచర జవాను కనిపించకుండా పోయిన విషయం మిగిలిన జవాన్లు గుర్తించలేదు. కొంత సేపటి తర్వాత వారు గుమిగూడటంతో ఒక జవాన్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గత వారం కూడా ఓ బీఎస్‌ఎఫ్ జవాను ఇలాగే దారి తప్పి పాక్ భూభాగంలో వెళ్లిపోగా బీఎస్‌ఎఫ్ అధికారులు పాక్ రేంజర్లను సంప్రదించి జవానును క్షేమంగా తీసుకురాగలిగారు. ప్రస్తుతం జవాన్‌ను వదిలిపెట్టడానికి పాక్ రేంజర్లు నిరాకరింస్తున్నట్లు తెలుస్తుంది.