Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కునిపోయి తీవ్రంగా గాయపడిన విద్యార్థిని శశికళ చికిత్స పొందుతూ మృతి చెందింది. కంపార్ట్ మెంట్ నుంచి కిందికి దిగే ప్రయత్నంలో వెనుక నుంచి డోర్ బలంగా ఢీకొనడంతో శశికళ ప్రమాదవశాత్తు కిందికి జారిపోయింది.
రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య చిక్కుకుని గంటల కొద్దీ నరకయాతన చవిచూసింది. రైల్వే రెస్క్యూ టీం స్పందించి ప్లాట్ ఫాంను పగులగొట్టినా, అప్పటికే ఆమెకు అంతర్గతంగా తీవ్ర గాయాలయ్యాయి. బ్లాడర్, నడుం భాగం ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తరుణంలో విద్యార్థినిని షీలానగర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో తను మృతి చెందినట్లు తెలిసింది. శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీయే చదువుతోంది. ఆమె మరణవార్తలో కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది.