Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లలో నాలుగు రోజుల నష్టాలకు ఇవ్వాళ బ్రేక్ పడింది. ఈ రోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కీలకమైన గుజరాత్ లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 62,571కి చేరుకుంది. నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 18,609 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: సన్ ఫార్మా (3.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.56%), టీసీఎస్ (0.90%), కొటక్ బ్యాంక్ (0.72%), నెస్లే ఇండియా (0.68%).
టాప్ లూజర్స్: యాక్సిస్ బ్యాంక్ (-2.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), ఎల్ అండ్ టీ (-2.06%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.02%), ఇన్ఫోసిస్ (-0.93%).