Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి కాసేపట్లో గవర్నర్‌గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, గత ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయో తెలుసుకుని వచ్చే ఎన్నికల నాటికి అధిగమించి మెరుగైన ఫలితాలు సాధిస్తామని దీమా వ్యక్తంమ చేశారు.