Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహిస్తూ గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి రఘు శర్మ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని కోరారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2017 ఎన్నికల్లో 77 స్థానాల్లో గెలిచింది. ఈ సారి కనీసం 20 స్థానాలను కూడా దక్కించుకోలేకపోయింది.