Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోన్న తరుణంలో టీమిండియా భవిష్యత్ ప్రణాళికలపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. పూర్తిస్థాయి జట్టు ఇంకా అందుబాటులోకి రాలేదని వెల్లడించాడు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారని, అందుకే పలు సిరీస్ లకు వేర్వేరు జట్లను పంపించాల్సి వచ్చిందని తెలిపారు. గడచిన రెండేళ్లుగా టీ20 వరల్డ్ కప్ లను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించామని, ఇక వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుండడంతో, ఇకపై ఆ 50 ఓవర్ల ఫార్మాట్ పై దృష్టి సారిస్తామని ద్రావిడ్ తెలిపాడు. వచ్చే మూడు నెలల కాలం జట్టు సన్నాహాల పరంగా ఎంతో కీలక సమయం అని అభిప్రాయపడ్డాడు. భారత్ లో మూడు విదేశీ జట్లతో వన్డే సిరీస్ లు జరగనున్నాయని, వాటిలో పూర్తిస్థాయి జట్టును బరిలో దించుతామని చెప్పాడు.