Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గూగుల్ సంస్థ నుంచి కొత్త అప్‌డేట్ వచ్చింది. మ్యాపింగ్ సర్వీస్ వేజ్, జియో ఎర్త్‌ను ఒకే గొడుకు కిందకు తెస్తున్నట్టు గూగుల్ గురువారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వేజ్ యాప్‌ను ఏటా 15 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు.
వేజ్ సంస్థలో పనిచేస్తున్న 500 మందిని ఇకనుంచి గూగుల్ జియో ఉద్యోగులుగా పరిగణించనున్నారు డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. వేజ్ టీమ్‌ను జియోలోకి తీసుకోవడం వల్ల వాళ్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది అని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. గూగుల్ సర్వీస్‌లను మరింత ఉపయోగకరంగా మారుస్తామని, రెండు కంపెనీల్లో పెట్టుబడులను ఒకే సంస్థ కిందకు తెస్తామని జూలై 12వ తేదీన గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ఒక లెటర్‌లో తెలిపారు.